ఇక రైళ్లలోనూ హోస్టెస్‌లు!!!

విమానం ఎక్కగానే మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఆతిథ్య సేవలందించే ఎయిర్‌హోస్టెస్‌లు మనకు కనిపిస్తారు. ఇదే తరహాలో రైళ్లలోనూ ‘ట్రైన్‌ హోస్టెస్‌’లు వస్తున్నారు. ఇప్పటికే గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న ఈ తరహా సేవలు త్వరలో రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లలో వీరితోపాటు మేల్‌ స్ట్యువర్డ్‌ కూడా ప్రయాణికులకు ఆతిథ్య సేవలందించనున్నారు. ఆహారం, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు వంటివి అందజేస్తారు.

రైళ్లలో ఆతిథ్యసేవలు, ప్రయాణికులతో మాట్లాడే విధానం వంటి వాటిపై వారికి శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.
• రైల్వేస్టేషన్లలో ఆహారకేంద్రాలు, ప్యాంట్రీలకు చెందిన 2,000 మంది సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. తర్వాతి దశలో ప్లాట్‌ఫారాలపై అధికారికంగా ఆహార పదార్థాలు విక్రయించేవారికి ఐఆర్‌సీటీసీ శిక్షణ ఇవ్వనుంది.
• ప్రయాణికులతో వ్యవహరించే విధానం, వస్త్రధారణపై కేంద్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తుంది.
• ట్రైన్‌ హోస్టెస్‌లు దుస్తులపై యాప్రాన్‌లు వేసుకుని, చేతికి తొడుగులు (గ్లవ్స్‌) ధరిస్తారు. తలకు టోపీలు పెట్టుకుంటారు.

Advertisements

వాట్సాప్ లో కొత్త ఫ్యూచర్.. !!!

మెసేజ్‌ పంపినంత సులువుగా నగదు బదిలీ

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఈ ఏడాది ఆఖరు నాటికల్లా నగదు చెల్లింపుల సేవలను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ గ్లోబల్‌ హెడ్‌ విల్‌ కాథ్‌కార్ట్‌ వెల్లడించారు. మెసేజ్‌ పంపినంత సులువుగా నగదు బదిలీ ప్రక్రియను సులభతరం చేయాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. ‘యూపీఐ ప్రాతిపదికన భారతీయ బ్యాంకులతో కలిసి పేమెంట్స్‌ వ్యవస్థను రూపొందించాం. దీన్ని సరిగ్గా అమలు చేయగలిగితే భారత్‌లో మరింత మందిని ఆర్థిక సేవల పరిధిలోకి తేవొచ్చు. అలాగే డిజిటల్‌ ఎకానమీలోకి భాగంగా చేయొచ్చు. ఈ ఏడాది ఆఖర్లోగా పేమెంట్‌ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విల్‌ చెప్పారు.

కర్ణాటక లో కుమారస్వామి ప్రభుత్వం ఫట్..!!! (ముఖ్యంశాలు)

>వీగిపోయిన విశ్వాస తీర్మానం
>విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 99 ఓట్లు
>వ్యతిరేకంగా 105 ఓట్లు
>సుదీర్ఘంగా సాగిన బల పరీక్ష ప్రక్రియ

>కాంగ్రెస్ +jds సభ్యులు 15 మంది రాజీనామా తో ఏర్పడిన సంక్షోభం

>కాసేపట్లో గవర్నర్ కలిసి రాజీనామా సమర్పించనున్న కుమారస్వామి
>త్వరలో యడ్యూరప్ప సీఎం…

>బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం
>ప్రజస్వామ్యం విజయంగా పేర్కొన్న యడ్యూరప్ప
>రాజ్ భవన్ కి వెంటనే బయల్దేరిన కుమారస్వామి

నిరుపేదకు రూ.128కోట్ల విద్యుత్‌ బిల్లు…!!!

హాపూర్‌:
ఉత్తర్‌ ప్రదేశ్‌లో విద్యుత్ శాఖ అధికారుల దారుణమైన నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగుచూసింది. రాష్ట్రంలోని హాపూర్‌ పరిధిలోని ఛామ్రీ గ్రామానికి చెందిన షామీమ్‌ అనే నిరుపేదకు ఏకంగా రూ.128 కోట్లలను విద్యుత్‌ బిల్లు వేశారు. సాధారణ బిల్లు కట్టాల్సిన గడువు దాటి పోవడంతో ఇంతమొత్తం కట్టాలని అధికారులు అదేశించారు. బిల్లును చూసి షాకైన షామీమ్‌ విద్యుత్‌ అధికారుల వద్దకు వెళ్లి నిలదీశాడు. ఇంతమొత్తంలో ఎందుకు కట్టాలో చెప్పాలని కోరాడు. ఎంతమాత్రం స్పందించని అధికారులు రూ.128 కోట్లు కట్టితీరాలని, లేకపోతే విద్యుత్‌ కనెక్షన్‌ తిరిగి ఇవ్వమని తేల్చి చెప్పారు. ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డ షామీమ్‌ మీడియాను ఆశ్రయించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొన్నాడు.

నిరుపేదకు రూ.128కోట్ల విద్యుత్‌ బిల్లు
‘మా ఇంట్లో నేను, నాభార్య ఉంటాం. ఒక లైటు, ఒక ఫ్యాను ఉపయోగించుకుంటాం. మేం నెల మొత్తం 2కిలో వాట్స్‌కి మించి వాడం. వాటికి ఎంత ఎక్కువ వేసినా బిల్లు రూ.700-800 దాటదు. కానీ రూ.128 కోట్లు మేం ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెల్లించాలి?. నా జీవితం మొత్తం కష్టపడినా నేనంత మొత్తాన్ని సంపాదించలేను. ఎన్నిసార్లు నా సమస్యను అధికారులకు విన్నవించుకున్నా మమ్మల్ని పట్టించుకోలేదు. మొత్తం బిల్లు కట్టితీరాల్సిందేనని నోటీసులు కూడా పంపారు. ఇది నా ఇంటి వరకే వచ్చినట్లు లేదు. రాష్ట్రం మొత్తం బిల్లు నాతోనే కట్టించాలనుకున్నారేమో.

నాకు న్యాయం చేయండి’ అని వేడుకున్నాడు. దీనిపై విద్యుత్‌ శాఖ ఇంజినీర్‌ రామ్‌ శరణ్‌ను వివరణ కోరగా సాంకేతిక లోపాల కారణంగా అలా వచ్చి ఉండొచ్చని చెప్పారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.

కొత్త రేషన్ కార్డులకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. !!!

72 గంటల్లో రేషన్‌కార్డు

అక్టోబరు నుంచి జారీ

ఈలోగా వడపోత

రేషన్‌కార్డుల జారీలో పౌరసరఫరాల శాఖ కొత్త విధానం ప్రవేశపెడుతోంది. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే కార్డు చేతికిచ్చే వినూత్న విధానాన్ని తీసుకొస్తోంది. గ్రామ సచివాలయాలు ప్రారంభమయ్యే అక్టోబరు 2నుంచే ఈ విధానం కూడా అమల్లోకి రానుంది. కార్డు కావాల్సిన వారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే, అక్కడి నుంచి దానిని ఆన్‌లైన్‌ దరఖాస్తుగా మార్చి 3రోజుల్లో దరఖాస్తుదారుని చేతికి కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈలోగా రాష్ట్రంలోని మొత్తం కార్డులను వడపోసి, అందులో అనర్హులు ఎవరైనా ఉంటే తొలగించాలని నిర్ణయించింది.

డోర్‌ డెలివరీకి సిద్ధం కండి

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ శుక్రవారం అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, పౌరసరఫరాల డీఎంలు, ఐటీడీఏల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రేషన్‌ డోర్‌ డెలివరీకి అందరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గ్రామ వలంటీర్ల నియామకాలను పరిశీలించి, రేషన్‌ సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. సెప్టెంబరు నుంచి శ్రీకాకుళంలో నాణ్యమైన బియ్యం ప్యాకెట్లుగా పంపిణీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శ్రీకాకుళంలో బియ్యం సార్టెక్స్‌ మిల్లులు లేనందున తూర్పు గోదావరిలో మిల్లింగ్‌, ప్యాకింగ్‌చేసి శ్రీకాకుళానికి తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. ‘స్పందన’లో వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండి, స్టోరేజ్‌ కేంద్రాలను గుర్తించాలని సూచించారు. దాన్యాన్ని నాణ్యతనుబట్టి గ్రేడింగ్‌చేస్తే బాగుంటుందన్నారు.

చందమామపై తొలి అడుగు, నేటికీ 50 ఏళ్లు

ఒక్క అడుగు… ఈ ప్రపంచ గతిని మార్చింది. అంతరిక్ష ప్రయోగాలకు ఊతమిచ్చింది. కలల జాబిల్లిని చేరేలా చేసింది. ఆ అద్భుత ఘట్టం జరిగి 50 ఏళ్లు పూర్తయ్యాయి.

అపోలో 11 మిషన్ కోసం 4లక్షల మంది శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు పనిచేశారు. చివరకు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకెల్ కొల్లిన్స్ మాత్రమే చందమామ చెంతకు వెళ్లేందుకు అనుమతి లభించింది. కోట్ల మంది ఆశల్ని, ఆశయాల్నీ మోసుకెళ్తూ… ఆ ముగ్గురూ… జాబిల్లి చెంతకు చేరారు. జులై 16, 1969న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచీ శాట్రన్ V రాకెట్… నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. కమాండ్ మాడ్యూల్ పైలట్ అయిన మైకెల్ కొల్లిన్స్… మాడ్యూల్‌లోనే ఉండిపోగా… నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బుజ్ అల్డ్రిన్ మాత్రం చందమామపై దిగాలని నిర్ణయించారు

చందమామ చుట్టూ తిరిగిన తర్వాత… ది ఈగిల్ అని పిలిచే మాడ్యూల్… చందమామ ఉపరితలం వైపు 13 నిమిషాలు ప్రయాణించింది. ఈ జర్నీలో రెండు కీలక సమస్యలు ఎదురయ్యాయి. లక్కీగా రెండింటినీ వ్యోమగాములు పరిష్కరించగలిగారు. మొదట… నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్‌కి భూమితో రేడియో కాంటాక్ట్స్ తెగిపోయాయి. ఆన్ బోర్డ్ కంప్యూటర్‌లో ఎర్రర్ మెసేజ్ కనిపించింది. రెండో సమస్య ఏంటంటే… ఇంధనం సరిపోని పరిస్థితి. అయినప్పటికీ మాడ్యూల్‌ని విజయవంతంగా చందమామపై ఉన్న పగులు లోయ సీ ఆఫ్ ట్రాంక్విలిటీలో జులై 20న విజయవంతంగా దింపగలిగారు.

మాడ్యూల్ నుంచీ బయటకు వచ్చి… చందమామపై తొలి అడుగు పెట్టిన వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్. తాను వేస్తున్న ఈ చిన్న అడుగు… మానవ జాతికి పెద్ద అడుగు అని అభివర్ణించారు. ముగ్గురు వ్యోమగాములూ… జులై 25, 1969న భూమికి తిరిగొచ్చారు. వారు ముగ్గురు చరిత్ర సృష్టించడమే కాదు… ఎన్నో సైన్స్ పరీక్షలకు ఉతమిచ్చారు.

టిటిడి రూల్స్ ఇక స్ట్రిక్ట్ … !!!

తిరుమలకు నిషేధిత వస్తువులు తీసుకెళ్లరాదు : టిటిడి

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ చట్టం 30/1987 ప్రకారం ప్రపంచప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలకు నిషేధిత వస్తువులు తీసుకెళ్లడం కానీ, వినియోగించడం కానీ చేయరాదని టిటిడి భక్తులను కోరుతోంది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవగాహన కల్పించేందుకు విస్త తంగా ప్రచారం చేపడుతోంది.

నిషేధిత వస్తువుల్లో మత్తుపానీయాలు, పొగాకు ఉత్పత్తులు, మాంసం, ఆయుధాలు, పేలుడు సామగ్రి ఉన్నాయి. తిరుమలలో జూదం ఆడడంతోపాటు పెంపుడు జంతువులను, పక్షులను ఉంచుకోవడం చేయరాదు.

లైసెన్సు గల ఆయుధాలు ఉన్న పక్షంలో సమీప పోలీస్‌ స్టేషన్‌లో వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అప్పగించాల్సి ఉంటుంది. నిషేధిత వస్తువులను కలిగి ఉన్న పక్షంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకురాకూడదని టిటిడి భక్తులను కోరుతోంది.

కోడికత్తి కేసులో హైకోర్టు కీలక నిర్ణయం..!!!

కొడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ రద్దు

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దాడికేసు నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ రద్దు

శ్రీనివాసరావుకు బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ

బెయిల్ రద్దు చేయాలంటూ ఎన్ఐఏ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ

ఏపీలో మరో కొత్తస్కీమ్‌..!!!

👉వైఎస్సార్‌ నవోదయం

జ్యుడిషియల్‌ కమిషన్‌ ముసాయిదాకు ఆమోదం
ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

అమరావతి: ఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కీలకమైన జ్యుడిషియల్‌ కమిషన్‌ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టెండర్ల ప్రక్రియలో పారదర్శక విధానానికి శ్రీకారం చుట్టామని.. అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగు వేశామని మంత్రివర్గం అభిప్రాయపడింది. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో టెండర్లను పరిశీలిస్తామని పేర్కొంది. రూ.100 కోట్లకు పైబడిన ప్రాజెక్టులను జ్యుడిషియల్‌ కమిషన్‌ పరిధిలోకి తీసుకురావాలని.. జడ్జికి సహాయంగా నిపుణులను అందివ్వాలని నిర్ణయించింది. టెండర్ల విషయంలో జడ్జి సిఫార్సులను సంబంధిత శాఖ తప్పనిసరిగా పాటించాలనే విధంగా చట్టం చేయనున్నట్లు పేర్కొంది. 15 రోజుల్లో టెండర్‌ ప్రతిపాదన ఖరారు చేసి, ఆ తర్వాత బిడ్డింగ్‌ ఆహ్వానించాలని కేబినెట్‌ నిర్ణయించింది. అర్హత ఉన్న కాంట్రాక్టర్లు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఎంఎస్‌ఎఈలను ఆదుకునేందుకు..
మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకం తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దానికి ‘వైఎస్‌ఆర్‌ నవోదయం’గా నామకరణం చేసింది. మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. జిల్లాల వారీగా 86 వేల ఎంఎస్‌ఎంఈల ఖాతాలను గుర్తించారు. రూ.4వేల కోట్ల రుణాలను వన్‌టైమ్‌ రీస్ట్రక్చర్‌ చేయనున్నారు. ఎన్‌పీఏలుగా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా దీని ద్వారా చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఎంఎస్‌ఎంఈలకు మరింత రుణంతో పాటు తక్షణ పెట్టుబడి అందే అవకాశం కలగనుంది. అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఎంఎస్‌ఎంఈలకు 9 నెలల వ్యవధి ఇవ్వనున్నారు.

ఎంత దోచారో 15 రోజుల్లో బయటికొస్తాయ్‌ :ముఖ్యమంత్రి జగన్‌

అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత మూడు రోజులుగా చర్చ జరుగుతూనే ఉందని,సభలో ప్రతి రోజూ జలవనరుల మంత్రి ఈ అంశంపై చర్చిస్తూనే ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు అంతా కుంభకోణాల మయమైందని ఆరోపించారు.శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు.ఇటీవలే పోలవరం ప్రాజెక్టును పరిశీలించి వచ్చానని, నాలుగు నెలలుగా పూర్తిగా పనులు ఆగిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.నవంబర్‌ నాటికి ప్రారంభించి 2021 జూన్‌ నాటికి నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు.బిడ్డింగ్‌లో ఎవరు ఎంత తక్కువకు కోట్‌ చేస్తారో వాళ్లకే అప్పగిస్తామని జగన్‌ స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్టు నిధులపై రీ బిడ్డింగ్‌ వేస్తే రూ.6,500 కోట్ల పనుల్లోనే 15 నుంచి 20 శాతం మధ్య మిగిలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నట్లు జగన్‌ అసెంబ్లీలో వెల్లడించారు. ‘‘నామినేషన్‌ పద్ధతిలో ఇష్టమొచ్చిన గుత్తేదారును తీసుకొచ్చారు. యనమల వియ్యంకుడు కూడా సబ్‌ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు.ఎంతటి దారుణమైన కుంభకోణాలు జరుగుతున్నాయో చూశాం. పనులు ప్రారంభించకుండానే రూ.724 కోట్లు అడ్వాన్స్‌ కింద కట్టబెట్టారు.పోలవరంలో ఎంత దోచారో మరో 15 రోజుల్లో బయటికొస్తాయి.ఈ ప్రాజెక్టు విపరీతమైన కుంభకోణాలతో నిండిపోయింది’’ అని సీఎం జగన్‌ ఆరోపించారు.

Create your website at WordPress.com
Get started